తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 25 April 2016

అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది

ఒకనీతికథ ....
ఓ రెండు నిముషాలు కేటాయించి చదవండి .
బావుంది......


ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు.  వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?"  అని అడిగారు.  అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన.  "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి.  వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.  "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?"  అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో  ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా"  అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్యం వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, ఇవరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని  పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత…...
🙇🏽🙇🏽🙇🏽🙇🏽🙇🏽

ఆ రోజు వారి పెళ్ళిరోజు , నీలిమ తన భర్త సంతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది.

ఇది ఒక అద్బుతమైన  బావం  అని నేను భావిస్తున్నా
అది మీరే చెప్పాలి

. . . . . . . . . . . . . ఆ రోజు వారి  పెళ్ళిరోజు , నీలిమ తన భర్త సంతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది. సాయంత్రం . . .
వారికి పెళ్లి అయి కొన్ని సంవత్సరాలు అయ్యింది , మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది : . . . . . రాను రాను చిన్న చిన్న అందమైన సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి , ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు

నీలిమ ఆలోచన అంతా ఒకటే !
ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని !  అంతలొ కాలింగ్ బెల్ మోగింది . . . నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది. వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది . ఇద్దరు గత స్మృతిలలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంతలో ఫొన్ రింగ్ వినపడింది ,  నీలిమ పక్క గదిలొ వున్న ఫోన్ తీసింది. అటువైపునుండి . . . ఇది mr సంతోష్ గుప్త గారి ఇల్లేనా ? సారి మేడమ్   ఇక్కడ ఒక accident అయ్యింది , ఒకతను చనిపోయాడు, purse లొ . మీ భర్త గారి ఫొటో వుంది , మీరు వఛి body తీసుకెళ్ళండి.
నీలిమ ఒక్కసారి shock!!!!!!
అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు . . . . అది ఎలా సాద్యం?  లేదు మేడమ్  ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , mee భర్త purse వుంది ఇక్కడ . . . .
నీలిమ పరుగు పరుగున ఆ గది లోకి వేల్లిచూస్తే సంతోష్ లేడు .  నీలిమ ఒక్కసారి కూలబడింధి
ఎవురు  మరి? సంతోష్ ఆత్మ ? చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వఛ్హడా !!!! దేవుడు నాకు ఒక్క chance ఇస్తే బాగుండు , నేను కూడ  అతనితో పాటు చనిపోతే బాగుండు , మరో . జన్మలొనైనా కలిసి వుండేవాళ్ళం ఒకటే ఆవేదన !ఆవేదన . . . .
ఇంతలొ బాతరూమ్ తెరుచుకున్న సౌండు , ఎదురుగా సంతోష్ , సారి నీలిమ నీకొక విషయం చెప్పడం మరిచాను , ఈరోజు ట్రైన్station లొ నా purse పోయింది అని ఇంకా ఏదో చెపుతున్నాడు , అవి ఏవీ నీలిమ చెవిని చేరడం లేదు ! అతనికోసo తన గుండె  వేదన ! తనకున్న పట్టరాని సంతొషంతొ !!!!! ఒక్కసారి వెళ్ళి మనసారా హత్తుకున్ది అతన్ని . . . . . .

జీవితం అనేది ఇంకొక అవకాశం కోసం కాదు , అది వున్నప్పు
డే మనం ఉపయోగిన్చుకోవాలి , ఆనందంగా వుండాలి
ఈజన్మలో
అది అమ్మ - -నాన్నలతో
అది మన జీవిత బాగస్వాములతో అది మన తోబుత్తువులతో
అది మన మిత్రులతో  . . .
జీవితం ఆస్వాదించండి ! ఆనందంగా వుండండి . . .

Monday 18 April 2016

కేన్సర్ వస్తే అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి తగ్గిస్తున్న..... దైవ సమానులైన ఆ డాక్టర్ల వివరాలు

www.onenandyala.com

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి.
కేన్సర్ వస్తే తగ్గడానికి అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి,
పూర్తిగా ఆ రోగాన్ని అనేకమందికి తగ్గిస్తున్న.....
దైవ సమానులైన ఆ డాక్టర్ల వివరాలు మీకు తెలియజేస్తున్నాను.
మీ మిత్రులకు , శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేయండి.

ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న ఈ డాక్టర్ దంపతులు.....
కేరళ , కర్నాటక బోర్డర్ లో Panaje, Daithota అనె గ్రామంలో నివసిస్తున్నారు.
అక్కడికి మనం వెళ్ళగానే హడావుడిగా వారు మందులు ఇవ్వరు.
ఇచ్చే ముందు వారు అనేకానేక ప్రశ్నలు వేస్తారు
ఆతరవాతనే మందులు నిర్ణయించి ఇస్తారు. అది వారి పద్దతి.
అక్కడ బ్లడ్ కేన్సర్ తో సహా... ఎన్నో కేన్సర్లు పూర్తిగా నయమై
జీవిస్తున్న వాళ్ళున్నారు. వాలంటీర్లు గా కొన్నాళ్ళు సేవచేసి ,
మళ్లీ తమ తమ వృత్తులు ,ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నవారు
ఎంతో మంది ఉన్నారు..
వైద్యం ఖర్చుకూడా చాలా చాలా చాలా తక్కువ. నెలకు సుమారు రెండు నుంచి మూడు వేల రూపాయల లోపే అవుతుంది.
డాక్టర్ గారి పేరు 'దైతోట వెంకట రామ' Daithota Venkata Rama ,
ఆయన భార్య పేరు జయలక్ష్మిగారు.
వాళ్లకి కన్నడ ఇంగ్లీషు బాషలు మాత్రమే వచ్చు.
హాస్పిటల్ వివరాలు :
Phone timings : 2 to 3-30 pm and 6 to 9-00 pm
Dr Venkata Rama's Wife Jaya Lakshmi గారే ఫోన్లో మాట్లాడతారు.
Phone Numbers 04998 - 226296
Mobile 09481 961508
Dr P.S. Vekata Rama, (Vaidya )
Daithota, Panaje, Puttur, Daxina Kannada - Pin Code : 574259.
From Puttur, around 25 K.M.
From Kasargod Railway station 35 K.M.,
Kasargod to Perla to Panaje, Daithota,
you can reach there by Local vehicles.
Trains are there from many areas to Kasargod Railway Station.
PLEASE SHARE THIS AND SAVE SOMEONE

Saturday 16 April 2016

బరువు తగ్గాలనుకునే వారు..ఈ రైస్ డ్రింక్ ను ఓసారి ట్రై చేసి చూడండి.!

www.onenandyala.com :: బరువు తగ్గాలనుకునే వారు..ఈ రైస్ డ్రింక్ ను ఓసారి ట్రై చేసి చూడండి.!

పెరిగిన బరువుతో నడవడం కాసింత కష్టమైపోతుందా? జిమ్ ల చుట్టూ తిరిగినా ఫలితం లేదా? టివీ లో యాడ్స్ చూసి మరీ ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్ కూడా మీ బరువును తగ్గించలేకపోయాయా? అయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి. పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్ ఇది. మనం ప్రతిరోజూ తినే భియ్యాన్నే ప్రధాన వస్తువుగా తీసుకొనే ఈ పానీయాన్ని సేవిస్తే గనక బరువు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట… ఈ రైస్ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చట!.. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు.:
బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
నీరు – తగినంత
జీలకర – తగినంత
ఎండిన అల్లం పొడి – తగినంత
మిరియాల పొడి- తగినంత

తయారు చేసే విధానం:

జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్‌ను వేసి డికాషన్‌లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. సూప్స్‌కు బదులుగా దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొంత ద్రవం తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.

Friday 15 April 2016

వేసవిలో జల్జీర పానీయం త్రాగడం చాలా అవసరం

వేసవిలో జల్జీర పానీయం త్రాగడం చాలా అవసరం
వేసవి సీజన్ లో జల్జీర త్రాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, జీర్ణక్రియ మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచతుంది. శరీరంలో ఎక్సెస్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్స్ తగ్గిస్తుంది. వేసవి సీజన్ లో జల్జీర పానీయాన్ని త్రాగడం వల్ల వివిధ రకాల జీర్ణసమస్యలను నివారించుకోవచ్చు. ఈ శీతలపానియాన్ని తీసుకొన్నప్పుడు పొట్టలో టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీరా వాటర్ త్రగడం వల్ల కూడా వేసవి సీజన్ లో శరీరంను రిఫ్రెష్ చేస్తుంది మరియు శరీరంను చల్లగా ఉంచుతుంది. సమ్మర్ హీట్ ను బీట్ చేయాలంటే ఇలాంటి హెల్తీ డ్రింక్ త్రాగాల్సిందే... అదేవిధంగా ఈ వేసవి కాలంలో మరో ఆశ్చర్యం, మామిడిపండ్ల సీజన్ కాబట్టి, మామిడి కాయతో తయారుచేసిన జల్జీర ను తీసుకోవడం మరింత ఆరోగ్యకరం.
Health benifits
** జల్జీర వాటర్ త్రాగడం వల్ల పొట్ట ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను నయం చేస్తుంది. గ్యాస్ నివారించబడే వరకూ కొద్దిగా కొద్దిగా జీర వాటర్ త్రాగుతుండాలి.
** వేసవి వేడివల్ల ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు నెట్టివేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు మూడు సార్లు త్రాగాలి. దాంతో బాడీ హీట్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
** బరువు తగ్గించడానికి : ఈ జీర వాటర్ ను రోజుకు రెండు సార్లు త్రాగితే ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అందువల్ల తక్కవుగా తింటారు. దాంతో బరువు తగ్గించుకోవచ్చు.
**ఎసిడిటి తగ్గిస్తుంది:జల్జీర జీర్ణ సమస్యలకు చాలా మంచిది. మీరు ఎక్కువ భోజనం చేసినప్పుడు ఒక గ్లాసు జీర వాటర్ కొద్దిగా నిధానంగా తీసుకొంటే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటిని వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
** మలబద్దకం నివారిస్తుంది: జల్జీర త్రాగడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. వేసవి కాలంలో మలబద్దకానికి గురిఅవుతుంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.
జల్జీర పానీయం తయారీకై ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?t=14&v=YQ25fF8ETX4