తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday 2 July 2014

బాసులు ఏ వంకతోనైనా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు

ఒక ఆఫీసులో..
ఒకసారి బాస్ ఒక ఉద్యోగిని పిలిచాడు. ఇదిగో అరుణ్.. కొన్ని కారణాల వలన మన సంస్థలోనుంచి కొందరిని ఉద్యోగం నుంచి తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే, నువ్వు కాస్త తెలివైనవాడివి కాబట్టి నీకు ఒక పరీక్ష పెడతాను. అన్ని సమాధానాలు సరిగ్గా చెబితేనే నీ ఉద్యోగం ఉంటుంది లేదా ఉండదు.
ఉద్యోగి : సరే సార్.. అడగండి.
బాస్ : పైన ఒక విమానం పై 50 ఇటుకలున్నాయి. అందులోంచి ఒక ఇటుక కింద పడితే, అక్కడ ఎన్ని ఇటుకలుంటాయి?
ఉద్యోగి : చాలా సింపుల్.. 49 ఇటుకలు.
బాస్ : గుడ్. మూడు స్టెప్స్ లో ఒక ఏనుగుని ఫ్రిజ్ లో ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీసి, ఏనుగుని అందులో పెట్టి, తలుపు మూసేస్తాను.
బాస్ : హా.. మరి నాలుగు స్టెప్స్ లో ఒక జింకను ఫ్రిజ్ లో ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీస్తాను. అందులో ఉన్న ఏనుగుని బయటకు తీసి, జింకను పెట్టి, ఫ్రిజ్ తలుపు మూసేస్తాను.
బాస్ : నైస్.. ఒక సింహం పుట్టినరోజు జరుపుకుంటుంది. అక్కడికి అన్ని జంతువులూ వచ్చాయి, కానీ, ఒక్కటి మాత్రం రాలేదు. ఎందుకని?
ఉద్యోగి : ఎందుకంటే, జింకని మనం ఫ్రిజ్ లో పెట్టాం కదా!
బాస్ : ఓహో..! ఒక ముసలావిడ అడవిలో నుంచి నదిని దాటి వెళ్ళాలి. నదిలో అన్నీ మొసళ్ళు ఉన్నాయి. వంతెన లేదు. ఎలా దాటుతుంది?
ఉద్యోగి : చాలా ఈజీ.. మొసళ్ళన్నీ సింహం పుట్టినరోజుకని వెళ్ళాయి. ఆమె సులభంగా దాటి వెళుతుంది.
బాస్ : అబ్బో.. బాగుందయ్యా..! చివరి ప్రశ్న. అందులో మొసళ్ళు లేకపోయినా ఆ ముసలావిడ చనిపోయింది. ఎందుకు?
ఉద్యోగి : ఆ.. మ్మ్.. ఒకవేళ.. ఆ.. ఆ.. ముసలావిడకి ఈత రాక మునిగిపోయి ఉండవచ్చు (తడబడుతూ చెప్పాడు)
బాస్ : కాదు. పైన విమానం నుంచి పడిన ఇటుక ఆవిడ తలపై పడింది. అందుకే!
సో.. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను.
నీతి : బాసులు ఏ వంకతోనైనా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు